
నక్షత్ర దీక్ష వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 27న నిర్వహించనున్న నక్షత్ర దీక్ష వాల్‌పోస్టర్లను హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్తకొండ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు ఆయన సూచించారు. కాగా, నక్షత్ర దీక్ష మాలధారణ ఈ నెల 27న ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ అర్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కిషన్‌రావు, అర్చకులు రాంబాబు, రాజయ్య, శ్రీకాంత్, వినయ్ పాల్గొన్నారు.