
ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్యలపై జూడాల నిరసన
ఎంజీఎం: అర్హతలేని వ్యక్తులను పొగుడుతూ.. ‘క్వాక్స్’ను ప్రోత్సహించేలా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాకతీయ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్స్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం కేఎంసీ ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి మెడికల్ రంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. తెలంగాణ వైద్యమండలి సైతం ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసి వారంలోగా వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.