
చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
నెక్కొండ: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 26న మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య ఇంట్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసును సీపీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. పలు దొంగతనాల్లో నేరస్తుడు ఆటో డ్రైవర్ బిర్రు రమేశ్‌బాబు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం నెక్కొండ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో రమేశ్‌బాబును అదుపులోకి తీసుకుని విచారించగా బండారి కొమురయ్య ఇంటిలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిందన్నారు. గతంలో జనగామ, నల్లగొండ టూ టౌన్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేశాడని ఆయన వివరించారు. నిందితుడి నుంచి నెక్కొండలో చోరీ చేసిన 2 తులాల బంగారం, 33 తులాల వెండి, జనగామలో చోరీ చేసిన 6.6 తులాల బంగారం, 65 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశామని ఏసీపీ చెప్పారు. అనంతరం రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందించామన్నారు. నెక్కొండ సీఐ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● బంగారం, వెండి ఆభరణాల రికవరీ..
● వివరాలు వెల్లడించిన
నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి