
పెండింగ్ డీఏలు చెల్లించాలి
దుగ్గొండి: ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలు చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాచినపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌సీని వెంటనే నియమించి, పెరిగిన ధరల ప్రకారం చెల్లించాలని, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. డీటీఎఫ్ మండల అధ్యక్షుడు రావుల దేవేందర్, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు భద్రయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చాంద్‌పాషా
నర్సంపేట రూరల్: తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామానికి చెందిన ఎండీ చాంద్‌పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన మడిపెద్ది వెంకన్న ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

పెండింగ్ డీఏలు చెల్లించాలి

పెండింగ్ డీఏలు చెల్లించాలి