
విద్యావంతులతోనే గ్రామాల అభివృద్ధి
ఐనవోలు: విద్యావంతులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి వారిని ఎన్నుకోవాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొండపర్తి నుంచి గువ్వలగూడెం, ఐనవోలు నుంచి రాంనగర్ వరకు రూ.16 కోట్లతో నిర్మించిన రెండు నూతన బీటీ రోడ్లు, బ్రిడ్జిలను టీజీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్థిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బీటీ రోడ్లు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ విక్రమ్ కుమార్, మాజీ ఎంపీపీ మార్నేని మధుమతి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్, రుగ్వేద్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సాంబయ్య, రాకేష్ రెడ్డి, ఎలిషా, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు