
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఉద్వాసన!
కేయూ క్యాంపస్: కేయూ విద్యా కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రణధీర్‌రెడ్డి ఈసంవత్సరం విధులు నిర్వర్తించేందుకు వర్సిటీ అధికారులు ‘కాంట్రాక్టు’ను రెన్యూవల్ చేయలేదు. విద్యాకళాశాలలో గతంలో రణధీర్‌రెడ్డి ప్రిన్సిపాల్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆసమయంలో అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. కళాశాలలోని బీఓఎస్ అకౌంట్‌లోని రూ.8.50 లక్షలు రణధీర్‌రెడ్డి వినియోగించుకుని, ఆతర్వాత నిధుల్ని తిరిగి రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్‌లోకి జమ చేసిన విషయం తెలిసిందే. ఈవ్యవహారంపై ‘నిధులు హాంఫట్’ శీర్షికన అప్పట్లోనే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. గురువారం విద్యాకళాశాలలో రిజిస్ట్రార్ రామచంద్రం అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి రణధీర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం రిజిస్ట్రార్ సమక్షంలో ఆవిద్యాకళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ మాట్లాడుతూ ‘మీ కాంట్రాక్టును వర్సిటీ అధికారులు రెన్యూవల్ చేయలేదని, ఇక నుంచి విధులకు రావొద్దని రణధీర్‌రెడ్డికి తెలిపారు.
రెన్యూవల్ కాని ‘కాంట్రాక్టు’
రణధీర్‌రెడ్డిని విధులకు రావొద్దన్న ప్రిన్సిపాల్ మనోహర్

కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఉద్వాసన!