
భాస్కర్‌రావుకు బెస్ట్ టీచర్ అవార్డు
రామన్నపేట: నగరానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు భాస్కర్‌రావు నేషనల్ సుశ్రుత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన శల్యకాన్–25 జాతీయ సమావేశంలో కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 35 ఏళ్లు వైద్యవృత్తిలో కొనసాగుతూ.. 15 వేలకు పైగా.. అర్షమొలలు, ిఫిష్టులా చికిత్సలు చేశారు. ఓవైపు వైద్యవృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు సెమినార్లలో పాల్గొనడం, పరిశోధనా పత్రాలు సమర్పించారు. వివిధ దేశాల్లో 30కిపైగా అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు సమర్పించిన ఘనత ఆయనది. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆయుర్వేద్విద్యా పీటీ గురువుగా పనిచేస్తున్నారు. భాస్కర్‌రావుకు అవార్డు రావడంపై స్నేహితులు, కుటుంబసభ్యులు, తోటి వైద్యులు అభినందనలు తెలిపారు.
గుర్తింపులేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు
విద్యారణ్యపురి: అనుమతి, గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే ముందు ఈ విద్యాసంవత్సరానికి అనుమతి ఉందా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను మధ్యలోనే మూసివేసే పరిస్థితులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు మాత్రమే పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయా విద్యార్థులకు పెన్ (పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్) కేటాయిస్తారని తెలిపారు. ఈ నంబర్ ద్వారా విద్యార్థి ఏ తరగతి చదువుతున్నాడు, ఏ పాఠశాలలో చదువుతున్నాడు, ఏ పాఠశాలకు మారాడు అనే వివరాలను యూడైస్ పోర్టల్‌లో ట్రాక్ చేస్తారని తెలిపారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థికి పెన్ కేటాయించరని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేటప్పుడు కచ్చితంగా గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలని డీఈఓ కోరారు.
మెడికల్ షాపులో చోరీ
నర్సంపేట రూరల్: మెడికల్ షాపులో చోరీ జరిగిందని ఎస్సై రవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డులో నిమ్స్ మెడికల్ షాపును చిట్టె గురు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11.30 గంటలకు షాపు బంద్ చేసుకుని ఇంటికి వెళ్లాడు. ఉదయం షాపు తీసేందుకు రాగా షట్టర్‌కు వేసిన తాళాలు పగులగొట్టి కనిపించాయి. అనుమానంతో షాపు తీసి చూడగా గల్లా పెట్టెలో ఉన్న రూ.35 వేల నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాపును పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో ఉచిత శిక్షణ కం ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో నెలరోజులపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, పార్సీ, బౌద్ధులు) మైనారిటీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు హనుమకొండ సుబేదారి షరిఫన్ మజీద్ దగ్గరలోని అపోలో ఫార్మసీ పక్కన రెండో అంతస్తులో ఉన్న మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయం, 040–23236112 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జిల్లా ఇన్‌చార్జ్
రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రవీ ణ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

భాస్కర్‌రావుకు బెస్ట్ టీచర్ అవార్డు