
ఇద్దరు దొంగల అరెస్ట్
నల్లబెల్లి: స్నేహితుడితో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ ఎలక్ట్రీషియన్. నిందితులను నల్ల బెల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.19,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్ వివరాలు వెల్లడించారు. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బొడిగె ప్రశాంత్ (బక్కులు) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. నల్లబెల్లి తిరుమల వైన్‌షాపులో పలుమార్లు విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ప్రశాంత్ దొంగతనం చేయాలనే ఆలోచనకు వచ్చాడు. వైన్ షాపులో పనిచేస్తున్న సమయంలో చోరీకి రెక్కీ నిర్వహించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు ఎల్ల బోయిన సాయికుమార్ (బన్నీ)తో చర్చించాడు. జల్సాలకు అలవాటుపడిన వారు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి వైన్‌షాపు వెంటిలేటర్‌ను బొడిగె ప్రశాంత్ పగులగొట్టి లోపలకు చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్‌లోని డబ్బులు దొంగిలించగా, కాపలా సాయికుమార్ ఉన్నా డు. షాపు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టారు. గురువారం నల్లబెల్లి క్రాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులకు వీరు అనుమానాస్పదంగా కనిపించారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.19,800 స్వాధీనం చేసున్నామని వెల్లడించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సమావేశంలో హెడ్‌కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, హోంగార్డు రమేశ్ పాల్గొన్నారు.
రూ.19,800
నగదు స్వాధీనం