
గంగదేవిపల్లిని సందర్శించిన విదేశీయులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని విదేశీయులు గురువారం సందర్శించారు. బాలవికాస పీపుల్స్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం కింద సీడీఎస్‌డీ కోర్సులో ఈ నెల 14 నుంచి 24 వరకు శిక్షణ పొందుతున్న విదేశీయులు క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు. ఇటలీ, నేపాల్, శ్రీలంక, భారతదేశంలోని జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 10 మంది పర్యటించారు. గ్రామంలో బీసీ హాస్టల్, పీహెచ్‌సీని ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు సాగుతామని వారికి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి తెలిపారు. అలాగే, వితంతువుల జీవన విధానం, గ్రామ అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం తదితర విషయాలను వివరించారు. బాలవికాస ప్రోగ్రాం డైరెక్టర్ సునీతారెడ్డి, సీనియర్ అసోసియేట్ కె.రమ, పంచాయతీ కార్యదర్శి కె.రమ్యకుమారి, పీఆర్‌ఏ ఎన్. శేఖర్, గ్రామ పెద్దలు కూసం లింగయ్య, రమేశ్ పాల్గొన్నారు.