
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
వేలేరు: ఆయిల్‌పామ్ పంట సాగుతో అధిక లాభాలున్నాయని, రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం మండలంలోని గుండ్లసాగర్‌లో 12 ఎకరాల విస్తీర్ణంలో కేఎన్ బయో సైన్స్ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తున్న రైతు మంగ సారంగపాణి వ్యవసాయ క్షేత్రంలో గెలల మొదటి కోత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, ఈ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతులు ప్రోత్సాహకాలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయిల్‌పామ్ పంటను కొన్న కేఎన్ బయోసైన్స్ వారు రైతులకు చెక్కులను కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. కాగా.. అంతకుముందు కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ఆయిల్‌పామ్ పంట కోతను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు అనసూయ, శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, హనుమకొండ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సుస్మిత, కేఎన్ బయోసైన్స్ జిల్లా మేనేజర్ రంజిత్‌కుమార్, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, మండల వ్యవసాయ అధికారులు కవిత, రాజేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
గుండ్లసాగర్‌లో పంట మొదటి కోత ప్రారంభం