
ఉప్పల్ రైల్వే స్టేషన్, ఆర్వోబీ పరిశీలన
కమలాపూర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్‌ను, ఆర్వోబీని దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఉప్పల్ రైల్వే స్టేషన్‌లోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఉప్పల్ ఆర్వోబీ పనుల పురోగతి, సత్వర పూర్తి కోసం చేపట్టాల్సిన చర్యలపై రైల్వే అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలిచ్చారు. అనంతరం బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్వోబీ పనుల్లో కీలకమైన రైల్వే ట్రాక్‌పై గడ్డర్ల బిగింపు కోసం రైళ్ల రాకపోకలను నిలపాల్సి వస్తుండడంతో పనులు చేపట్టే రోజున సుమారు 6 గంటల పాటు లైన్ బ్లాక్ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాంట్రాక్టర్‌పై సీబీఐ కేసు కారణంగా ఆర్వోబీ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని, మిగతా పనుల ఆలస్యానికి గల కారణాల్ని రైల్వే అధికారులు గుర్తించారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో ఆర్వోబీ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. అనంతరం ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించాలని కోరుతూ.. రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, నాయకులు తోట సురేశ్, తుమ్మ శోభన్, బండి కోటేశ్వర్, భపతి ప్రవీణ్, పుల్ల అద్భుతరావు, చిట్టి సుందరయ్య, దండబోయిన శ్రీనివాస్, పసునూటి రాణాప్రతాప్, గుర్రం సురేశ్, మేడిపెల్లి రాజు, లచ్చన్న, రాజేందర్, రావుల ఆకాష్, చింతల రంజిత్, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.