
జూనియర్ కళాశాలలకు నిధులు
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వివిధ మరమ్మతు పనులు చేపట్టేందుకు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ నిధులు మంజూరు చేశారు. హనుమకొండ జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, అందులో ఆరింటికి రూ.73.20 లక్షలు మంజూరయ్యాయి. హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కాలేజీకి మరమ్మతులు, వాటర్ సరఫరా, ఎలక్ట్రిఫికేషన్‌కు మొత్తంగా రూ.15 లక్షలు, హసన్‌పర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రూ.12.80 లక్షలు, ధర్మసాగర్ జూనియర్ కాలేజీకి రూ.13 లక్షలు, ఆత్మకూరు జూనియర్ కళాశాలకు రూ.4.40 లక్షలు, పరకాల జూనియర్ కళాశాలకు రూ.13 లక్షలు, శాయంపేట కళాశాలకు రూ.15 లక్షలు మంజూరయ్యాయి.
వరంగల్ జిల్లాలో కళాశాలలకు కూడా..
వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, అందులో పదింటికి రూ.1.36 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఖానాపురం కళాశాలకు రిపేర్లు, వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్, తాగునీటి సదుపాయం కల్పనకు రూ.15 లక్షలు, నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.15 లక్షలు, నర్సంపేట బాలికల జూనియర్ కాలేజీకి రూ.15లక్షలు, వర్ధన్నపేట కాలేజీకి రూ.8.50 లక్షలు, రాయపర్తి కాలేజీకి రూ.15.30 లక్షలు, నెక్కొండ కళాశాలకు రూ.14 లక్షలు, సంగెం కళాశాలకు రూ.15 లక్షలు, గీసుకొండ కళాశాలకు రూ.8.20 లక్షలు, రంగశాయిపేట కళాశాలకు రూ.15 లక్షలు, వరంగల్‌లోని కృష్ణాకాలనీ బాలికల జూనియర్ కాలేజీకి రూ.15 లక్షలు నిధులు మంజూరయ్యాయి.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే..
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ జూని యర్ కాలేజీల పనులను కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే అప్పగించాలని ఆదేశాలు వచ్చా యి. ఆయా కళాశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. పనులను వారికి అప్పగించేందుకు ఇంటర్ విద్య అధికారులు ఇప్పటికే ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశమై ఆదేశించారు.
పనులను పర్యవేక్షించాలి..
రాష్ట్ర విద్యమౌలిక సదుపాయల సంస్థలోని ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీలు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు పనులు సరిగా జరిగేలా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులకు పంపించాల్సి ఉంటుంది.
– ఎ.గోపాల్, శ్రీధర్‌సుమన్,
హనుమకొండ, వరంగల్ డీఐఈఓలు
హనుమకొండకు రూ.73.20 లక్షలు, వరంగల్‌కు రూ.1.36 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు
మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమ్మ ఆదర్శ పాఠశాలల
కమిటీలకే అప్పగింత
మరమ్మతులు, నీటి సౌకర్యం
తదితర పనులు చేపట్టాలి..