
‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’తో ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌కు మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈఒప్పందం ద్వారా 250 మంది విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, డేటా సైన్స్ తదితర అంశాల్లో కేంద్రీకృత శిక్షణ ఇవ్వనున్నారు. ఈశిక్షణతో విద్యార్థుల్లో ఉద్యోగావకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పంద లక్ష్యం అని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ బుధవారం తెలిపారు. ఎంఓయూపై కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ భరత్, సీనియర్ అసోసియేట్ సౌమ్య మైరెడ్డి సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మహేందర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.