
పంటలు ఎండిపోతున్నాయి..
వర్షాలు లేక పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. నాకు ఉన్న రెండు ఎకరాల్లో పత్తి పంట, నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేయడానికి నారు పోశాను. ఒక ఎకరం పది గుంటల్లో మిర్చి సాగు చేయడానికి మిర్చి గింజలను తెచ్చి పోశాను. 30 గుంటలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నా. మొదట్లో వర్షాలు పడగానే వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసిన. కానీ, వర్షాలు 20 రోజులుగా పడడం లేదు. దీంతో వేసిన మొక్కజొన్న, పత్తి, వరి పంటలు, మిర్చి నారుమడి ఎండిపోతున్నాయి. వ్యవసాయ బావిలో ఉన్న కొద్ది పాటి నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నాను. కానీ, బావిలో కూడా నీళ్లు మొత్తం అడుగంటిపోయాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే వర్షాలు కురిపించాలని వాన దేవుడిని మొక్కుతున్న.
– బాదావత్ వస్రం, అక్కల్‌చెడ, చెన్నారావుపేట మండలం
●