
ప్రజలకు అందుబాటులో ఉండాలి : డీఎంహెచ్‌ఓ
ఎంజీఎం: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్, పీపీ యూనిట్‌ను మంగళవారం ఆయన సందర్శించి రికార్డులు పరి శీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సాంబశివరా వు మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, పట్టణంలో పర్యటించినప్పుడు పరి సర ప్రాంతాలను పరిశీలించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని, వర్షాకాలంలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలు వివరించాలని పేర్కొన్నారు. జ్వరా లపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం పీపీ యూనిట్ వైద్యాధికారి యశస్విని, సూపర్‌వైజర్ నర్మద, రామా రాజేశ్‌ఖన్నా తదితరులు పాల్గొన్నారు.