‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం

Jul 16 2025 3:17 AM | Updated on Jul 16 2025 3:17 AM

‘ఎల్క

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం

బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025

10లోu

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

‘రాజుల పైసలు రాళ్లపాలు’ అన్నట్లుగా ఉంది కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)లో కొందరు అధికారుల తీరు. దీని పరిధిలో చేపడుతున్న పనులకు నిధుల కేటాయింపు తీరు వివాదాస్పదమవుతోంది. ముందుగా కేటాయించిన నిధులతో పనులు పూర్తి కానప్పుడు.. అంచనాలు స్వల్పంగా పెరిగినా రీ టెండర్‌ ద్వారా పనులు అప్పగించాల్సి ఉంది. కానీ, ఇదేమీ పట్టని కుడా ఇంజనీరింగ్‌ అధికారులు రెండింతలు అంచనాలు పెంచి ఓ ఉన్నతాధికారికి బంధువైన బినామీ కాంట్రాక్టర్‌ (సబ్‌ కాంట్రాక్టర్‌)కే పనులు అప్పగించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జంక్షన్‌, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం సుమారు రూ.1.54 కోట్లతో టెండర్లు పిలిచిన ఈ పనులను ఆ తర్వాత రూ.2.90 కోట్లకు పైగా పెంచి కొనసాగించడం కొత్త చర్చకు తెరలేపింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు కొందరు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

నిబంధనలకు మంగళం..

కాంట్రాక్టర్‌కు వత్తాసు..

వరంగల్‌ – కరీంనగర్‌, సిద్దిపేట – హనుమకొండ జాతీయ, రాష్ట్ర రహదారులకు సెంటర్‌గా ఉన్న ఎల్కతుర్తిలో సుందరంగా జంక్షన్‌ నిర్మించేందుకు ‘కుడా’ నుంచి నిధులు కేటాయించారు. రూ.1.60 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు ఏడాది కిందట టెండర్‌లు నిర్వహించారు. టెండర్‌ హనుమకొండ హంటర్‌రోడ్డులోని ఓ స్కూల్‌ నిర్వాహకుడు, కాంట్రాక్టర్‌కు దక్కింది. చివరి నిమిషంలో సదరు కాంట్రాక్టర్‌తో మంతనాలు జరిపిన ‘కుడా’ ఇంజనీరింగ్‌ అధికారి ఒకరు ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒకరికి సబ్‌ కాంట్రాక్టు (బినామీ)గా రూ.1.60 కోట్ల పనులు కట్టబెట్టారు. రెండు హైవేలకు జంక్షన్‌గా ఉన్న ఎల్కతుర్తిలో ఈ పనులు జరుగుతుండగానే.. రూ.1.54 కోట్ల పనులను రూ.2.90 కోట్లకు అంచనాలు పెంచారు. త్వరలోనే మరో రూ.60 లక్షలు పెంచి మొత్తం రూ.3.50 కోట్లకు చేర్చే ప్రయత్నం జరుగుతోంది. కాగా, 1.5 శాతం కంటే ఎక్కువగా అంచనాలు పెంచరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అంతకుమించి అంచనాలు పెంచడం అనివార్యమైతే పెరిగిన మొత్తానికి మళ్లీ టెండర్‌ నిర్వహించి పనులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా ‘కుడా’లోని ఓ ఇంజనీరింగ్‌ అధికారి తన సమీప బంధువుకు సబ్‌కాంట్రాక్టర్‌గా పనులు అప్పగించి ఇష్టారీతిన అంచనాలు పెంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది.

అధికారుల తీరుతోనే అభాసుపాలు..

వరంగల్‌, సిద్దిపేట, కరీంనగర్‌కు వెళ్లే రహదారులను కలిపే ఎల్కతుర్తిలో జంక్షన్‌ ఏర్పాటుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక చొరవ చూపారు. గతంలో అనేక సార్లు కోరినా కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభాకర్‌ ఈ జంక్షన్‌ కోసం అప్పటి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, కుడా చైర్మన్‌తో వరుస సమీక్షలు నిర్వహించారు. తక్షణమే నిధుల మంజూరుతో పాటు యుద్ధప్రాతిపదికన అత్యంత సుందరంగా ఎల్కతుర్తి జంక్షన్‌ను నిర్మించేందుకు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కమిషనర్‌, కలెక్టర్‌ శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేశారు. ఎల్కతుర్తి జంక్షన్‌ చుట్టూ రోడ్ల విస్తరణ పనుల అప్పగింత విషయంలో కొందరు ‘కుడా’ ఇంజనీరింగ్‌ అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఇదిలా ఉండగా జంక్షన్‌ నిర్మాణం కోసం రూ.1.50 కోట్లతో ఆన్‌లైన్‌లో టెండర్లు జరిగాయని, తర్వాత బీటీ, రోడ్డు వెడల్పు, సైడ్‌ డ్రెయిన్‌్స్‌ను అదనంగా కలపడంతో మరో రూ.2 కోట్ల వరకు పెరిగిందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతుండడం గమనార్హం.

న్యూస్‌రీల్‌

అమాంతంగా అంచనాల పెంపు

రీ టెండర్‌ లేకుండానే

పనుల కేటాయింపు

సుమారు రూ.1.54 కోట్ల నుంచి రూ.2.90 కోట్లకు పెరిగిన అంచనాలు

ఓ ఇంజనీరింగ్‌ అధికారి చేతివాటం..?

సబ్‌ కాంట్రాక్టర్‌గా బంధువుకు పనులు

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వరకు

ఫిర్యాదులు

అనుకున్నోళ్లకే ‘కుడా’ పనులు..

ఎల్కతుర్తిలో జంక్షన్‌, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం సుమారు రూ.1.54 కోట్లతో ఈ టెండర్లు పిలిచిన ‘కుడా’.. మొదటి నుంచి అనుకూలమైన వారికే ఈ పనులు అప్పగించే యోచన చేసింది. ఇందులో భాగంగానే భద్రకాళి బండ్‌ టెండర్‌తోపాటు ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు వర్క్‌ అగ్రిమెంట్‌ చేసే విషయంలోనూ కొందరు ఇంజనీరింగ్‌ అధికారులు తాత్సారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌ కు ఈ పనులు దక్కలేదన్న కారణంతో సతాయించారన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. దీంతో సబ్‌కాంట్రాక్ట్‌ ఇచ్చే ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించగా... జంక్షన్‌, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ తదితర సివిల్‌ వర్క్స్‌ కాకముందే ‘ముందుచూపు’తో గ్రీనరీ డెవలప్‌మెంట్‌ పనులకు షార్ట్‌ టెండర్లు పిలిచి టచ్‌లో ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇందుకు సకాలంలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనల మేరకు టెండర్లు పిలిచి అర్హులైన వారికి ఇచ్చామని ఇంజనీరింగ్‌ అధికారులు సమర్థించుకోవడం గమనార్హం.

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం1
1/4

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం2
2/4

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం3
3/4

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం4
4/4

‘ఎల్కతుర్తి’ జంక్షన్‌ పనుల్లో ఇష్టారాజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement