
బోనాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
వరంగల్ అర్బన్: శ్రావణ మాసంలో నిర్వహించే పోచమ్మ బోనాలకు ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో మేయర్ మాట్లాడారు. ఆలయాల వద్ద లైటింగ్, అంతర్గత రహదారుల్లోని గుంతలను డస్ట్‌తో చదును చేయాలని కోరారు. భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చేటప్పుడు, సమర్పించేటప్పుడు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. 66 డివిజన్లలో చేపట్టిన పనులను సమీక్షించి సకాలంలో పూర్తిచేయాలని, టెండర్ ప్రక్రియలో ఉన్న పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, సంతోష్‌బాబు, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
డ్రెయినేజీలో పూడికతీయండి..
వరంగల్ ఎంజీఎం మార్చురీ సమీపంలోని సినిమా థియేటర్ పక్కన ఉన్న డ్రెయినేజీ స్తంభించడంతో మేయర్ ప్రజారోగ్య విభాగం సిబ్బందిని మందలించారు. వెంటనే జేసీబీలతో డ్రెయినేజీలో పూడికతీయాలని ఆదేశించారు.
నగర మేయర్ గుండు సుధారాణి