
పరిశీలిస్తాం.. చర్యలు తీసుకుంటాం
● పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ
● ‘డయల్ యువర్ కమిషనర్’కు స్పందన
పరకాల: డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు, ఫిర్యాదులపై పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ తెలిపారు. సోమవారం ‘డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్’ కార్యక్రమానికి పలువురు ఫోన్ చేశారు. శానిటేషన్, ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్, డ్రెయినేజీ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఆయా విషయాలపై స్పందిస్తూ మున్సిపల్ ఏఈ, జవాన్లను సంబంధిత ప్రదేశాలకు పంపించి పరిశీలించాలని ఆదేశించనున్నట్లు, తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రవి, ఆర్‌ఓ రఘు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.