
ఆర్‌యూబీతో లోపాలను సరిచేయండి
నెక్కొండ: మండల కేంద్రంలోని ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంలో జరిగిన లోపాలను సరి చేయడంతోపాటు ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం ఆర్‌యూబీని అధికారులతో కలిసి సందర్శించి, మాట్లాడారు. ఆర్‌యూబీ నిర్మాణంతో వ్యాపారస్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మురుగు నీరు నిలువకుండా, వ్యాపారాలు కొనసాగేలా ఆర్‌యూబీలో ఉన్న లోపాలను గుర్తించి, పనులు చేపట్టాలన్నారు. అలాగే రోడ్డు డివైడర్‌ను తొలగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీఈ రాజేశ్వర్‌రావు, ఈఈ రమాదేవి, రమేశ్, ఏఈ గోపి, వ్యాపారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు సూచించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి