
యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
న్యూశాయంపేట: యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్‌ల్లో రైతులకు అవసరమైన మొత్తంలో యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు యూరియాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు సరఫరాపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. రైతుల రద్దీ తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి, ఇన్‌చార్జ్ జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద