
భూగర్భ జలాలు
స్వల్పంగా
పెరిగిన
హన్మకొండ:
గత రెండు నెలలుగా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. యాసంగి సాగు పంటలు చేతికి రావడంతో భూగర్భ జలాల నీటి వినియోగం తగ్గుతూ వస్తోంది. రుతు పవనాలకు ముందు మే నెలలో హనుమకొండ జిల్లా సగటు భూగర్భ జల మట్టం 8.55 మీటర్ల లోతులో ఉండగా.. జూన్ నెలాఖరుకు 8.37 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్‌లో 7.35 మీటర్ల లోతుల్లో మాత్రమే ఉంది. ఏప్రిల్‌లో పోలిస్తే మే నెలలో భూగర్భ జలమట్టం పడిపోయింది. మే నెలతో చూసుకుంటే జూన్ మాసాంతానికి స్వల్పంగా పెరిగింది. వరంగల్ జిల్లాలో మే మాసాంతంలో 6.14 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా జూన్ మాసాంతానికి 5.98 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్ మాసాంతంలో 6.21 మీటర్లు భూగర్భ జల మట్టం ఉండగా.. మే, జూన్ మాసాంతానికి స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ మాసంతో సగటు భూగర్భ జల మట్టం పరిశీలిస్తే హనుమకొండ జిల్లాలో పడిపోగా, వరంగల్ జిల్లాలో స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
జల వినియోగం పెరిగే అవకాశం
ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని ఫీజో మీటర్ల ద్వారా రికార్డు చేస్తారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి. వర్షాలు కురవక వరి సాగుకు భూగర్భ జలాలు తోడితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం రైతులు మెట్ట పంటల సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వరి సాగు కోసం రైతులు నారు పోస్తున్నారు. నారు ఎదిగే కొద్ది పొలం దమ్ము చేస్తే భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశముంది. ఈమేరకు వర్షాలు సమృద్ధిగా కురవక పోతే రైతులు పూర్తిగా భూగర్భ జలాలు మీద ఆధారపడాల్సిందే. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే వర్షం దోబూచులాడుతోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. మెట్ట పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ముందుగా విత్తిన మెట్ట పంటల మొలకలు ఎండిపోతున్న దశలో వారం రోజుల క్రితం కురిసిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం జీవం పోసింది. ఇప్పటి వరదలు పారే వర్షం కురువలేదు. దీంతో రైతులో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో సగటు భూగర్భ
జలమట్టం 8.37 మీటర్లు
హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు
ప్రాంతం ఏప్రిల్ మే జూన్
గట్ల నర్సింగాపూర్ 11.70 10.00 7.85
జగన్నాథపూర్ 10.91 12.60 17.10
కొత్తపల్లి 10.80 11.70 9.30
వంగర 15.80 15.84 15.60
ధర్మాపూర్ 6.22 6.50 4.70
ధర్మసాగర్ 2.30 1.90 0.90
పెద్ద పెండ్యాల 9.53 10.15 8.40
నారాయణగిరి 8.6 7.95 6.8
ఎల్కతుర్తి 7.70 7.40 7.40
హనుమకొండ 6.40 6.55 6.70
నాగారం 6.90 6.40 6.50
సీతంపేట 4.72 4.50 4.13
ఎల్లాపూర్ 4.90 4.50 4.13
ఐనవోలు ––– 28.90 27.90
పున్నేలు 5.00 5.53 6.20
పంథిని 5.70 6.10 6.50
శనిగరం 4.78 5.00 4.70
పీచర 16.30 17.40 21.55
వేలేరు 7.8 6.9 5.5
ఆత్మకూరు 3.00 3.20 2.60
దామెర 8.50 8.08 7.20
చర్లపల్లి 12.70 13.30 13.75
నడికూడ 1.40 2.30 2.85
పరకాల 4.56 5.50 5.00
పత్తిపాక 5.40 5.44 5.30

భూగర్భ జలాలు