
భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు
సంగెం/గీసుకొండ: సంగెం మండలంలోని చింతలపల్లి భవానీశంకరాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, సంధ్యారాణి దంపతులు ఆదివారం సందర్శించారు. కాకతీయుల కాలం నాటి భవానీశంకర మహా కాలబైరవాలయం ఆలయపూజారి సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భవానీశంకరాలయంలో రుద్రాభిషేకం, మహాకాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గీసుకొండ మండలంలోని ఊకల్‌లోని నాగేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీహర్ష, గుమిళ్ల విజయ్‌కుమారచార్యులు, కొండపాక రాజేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎలాంటి ప్రోటోకాల్, హంగు, ఆర్భాటం లేకుండా గోప్యంగా దేవతామూర్తులను సందర్శించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించడం విశేషం. ఇదిలా ఉండగా.. తన పర్యటనకు సంబంధించి ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయొద్దని, ఇది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు సమాచారం.