
పాలకమండలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయిస్తూ కేయూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. హాస్టళ్లు, రీసెర్చ్ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు తదితర వాటికి భూములు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆది వారం వరంగల్‌కు వచ్చిన ఆయనకు కేయూ భూ ములు పరిరక్షించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని పేర్కొన్నారు. ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్‌ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్, ఎస్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్, ఏఐడీఎస్‌ఓ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఉప్పులశివ, రాజు, రాజేశ్, చెట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్