
అతడి ఇల్లే ఒక వనం
శాయంపేట : ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లగానే రకరకాల మొక్కలు రారమ్మని స్వాగతం పలుకుతాయి. ఎటు చూసిన పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు కొమనేని రఘు,స్వాతి దంపతులు తమ ఇంటి ఆవరణలో 200 రకాల మొక్కలు పెంచుతున్నారు. అందులో సుమారు 80కి పైగా కాక్టస్ మొక్కలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉండే ఈ ముళ్ల రకం మొక్కలు ఇక్కడ పెరుగుతాయి. ఇది ఇంట్లో విడుదలైన కార్బన్ డయాకై ్సడ్‌ని గ్రహించి.. గాలిని శుభ్రమైన ఆక్సిజన్‌గా మారుస్తుంది. అదేవిధంగా పెర్షియన్ కార్పెట్, బ్రహ్మకమలం, ఫుట్‌బాల్ లిల్లీతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) గుర్తించిన స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, స్వార్ట్ పెర్న్, అలోవెరా, లుగ్లోనెమా, డ్రసీనియా, ఫెల్లో డెండ్రోస్, జెడ్ జెడ్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. వీటిని ఇంట్లో పెంచుకుంటే గాలిని శుద్ధిచేసి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నాసా పేర్కొన్నట్లు కొమనేని రఘు తెలిపారు.

అతడి ఇల్లే ఒక వనం