
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్కతుర్తి : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య సూచించారు. శనివారం ఎల్కతుర్తి పీహెచ్‌సీ పరిధిలోని సూరారం, ఇందిరానగర్, వల్బాపూర్ గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించారు. చిన్నారులకు అవుట్ రీచ్ ఇమ్యునైజేషన్‌లో భాగంగా టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వే నిర్వహిస్తున్న సమయంలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో మలేరియా, ఆర్‌డీటీ టెస్టులు చేసి మందులు అందించాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతోపాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య, సూపర్‌వైజర్ రామ్‌చందర్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
జిల్లా వైద్యాధికారి అప్పయ్య