
పంటలకు సరిపడా యూరియా ఇస్తాం
దుగ్గొండి: ఖరీఫ్ పంటల కోసం సరిపడా యూరియా ఉందని, రైతులకు అవసరం ఉన్నంత యూరియా అందిస్తామని నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి అన్నారు. శ్రీఅన్నదాతల అగచాట్లుశ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి మందపల్లి పీఏసీఎస్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఎంత యూరియా వచ్చింది, ఒక్కో రైతుకు ఎన్ని బస్తాలు ఇచ్చారు అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుకు నిర్దిష్టంగా ఇంతే యూరియా ఇస్తామని చెప్పడం సరికాదని సిబ్బందికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అవసరం ఉన్న మేరకు యూరియా ఇవ్వాలన్నారు. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్‌లు అవసరం లేదని ఏడీఏ స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లోని పీఏసీఎస్‌లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో సైతం యూరియా అందుబాటులో ఉంచుతామని వివరించారు. రైతులు ఆందోళన చెందకుండా యూరియా కోసం బారులు తీరొద్దని ఆయన కోరారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది రంగు వెంకటేశ్వర్లు, రాజు ఉన్నారు.
నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి
‘సాక్షి’ కథనానికి స్పందన

పంటలకు సరిపడా యూరియా ఇస్తాం