
ఉద్యోగి కుటుంబానికి బాసట
దామెర: మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి బాసటగా నిలిచారు తోటి ఉద్యోగులు. వివరాలిలా ఉన్నాయి. పులుకుర్తికి చెందిన గోవింద్ జైపాల్ ఒక సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల కిత్రం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు సీడ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్, తోటి ఉద్యోగులు ముందుకొచ్చారు. ఈ మేరకు గ్రామంలో రూ.55 వేల విలువైన 25 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. మంగళవారం జైపాల్ భార్య శోభారాణికి ఇంటిస్థలం పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
25 గజాల ఇంటి స్థలాన్ని
కొనుగోలు చేసి
పత్రాలు అందించిన తోటి ఉద్యోగులు