
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దామెర: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పరకాల రేవూరి ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓను నివేదిక అడిగి తెలుసుకున్నారు. వివరాలు సరిగా లేవని, తప్పుల తడకగా నివేదిక తయారు చేశారని ఎంపీడీఓ కల్పనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఇంత నిర్లక్ష్యం తగదని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేయిస్తాని హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌తోపాటు దామెర, ముస్త్యాలపల్లి, పులుకుర్తి, వెంకటాపూర్ గ్రామ పంచాయితీ కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించకుంటే రద్దుచేసి అర్హులకు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, హౌసింగ్ డీఈ రవీందర్, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, సీఐ రంజిత్ కుమార్, ఎస్సై కొంక అశోక్, ఏఓ రాకేశ్, సీనియర్ నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, సదిరం పోశాలు, దుర్శెట్టి భిక్షపతి, దామెర శంకర్, కిరణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నివేదిక తప్పుగా తయారుచేశారని దామెర ఎంపీడీఓ కల్పనపై ఆగ్రహం
ఆదిలాబాద్‌కు బదిలీ చేయిస్తానని హెచ్చరించిన ఎమ్మెల్యే