
ప్రహరీ నిర్మాణానికి విరాళాల సేకరణ
పరకాల: అమ్మ ఆదర్శ పాఠశాల కింద రూ.2లక్షల నిధులే మంజూరు చేయడంతో పరకాల పట్టణంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణం సాధ్యం కాదని సంబంధిత కాంట్రాక్టర్ గేట్ పిల్లర్‌లు వేసి చేతులు దులుపుకున్నాడు. దీంతో పాఠశాల ఆవరణలోకి పందులు, పశువులు వస్తున్నాయి. పిల్లలకు, నాటిన మొక్కలకు రక్షణ కరువైంది. విషయాన్ని గమనించిన అంబేడ్కర్ సేవా సమితి అధ్యక్షుడు బొచ్చు చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టగా రూ.50వేల జమయ్యాయి. అయా విరాళాలతో పాఠశాల ప్రహరీ, గేట్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల్లో పనులు ప్రారంభించి..గేట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.