
ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు
ఖిలా వరంగల్ : ప్రైవేట్ విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని, సకాలంలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్‌బాబు సూచించారు. వరంగల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్యపు) పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం ఫిట్నెస్ కోసం వచ్చిన బస్సులను అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా ఇన్చార్జ్ ఆర్టీఓ పరిశీలించారు. ఇప్పటి వరకు ఆరు బస్సులకు వివిధ కారణాలతో ఫిట్నెస్లు రిజెక్ట్ చేయగా, 40 బస్సులకు పరీక్షలు పూర్తి చేసి సర్టిఫికెట్స్ జారీ చేశామని వివరించారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకి బస్సు చర్యలు తప్పవన్నారు.