ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
న్యూశాయంపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులు, రైస్‌మిల్లర్లతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాల్లో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 25,923 మంది రైతుల నుంచి 1,22 372 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు అందుబాటులో గన్నీ సంచులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని సూచించారు. 83 మిల్లులను ట్యాగింగ్ చేసి, కొనుగోలు సెంటర్ల కేంద్రాల ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అదనంగా లారీలను కేటాయించి రవాణా చేయించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, డీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.
కాల్‌సెంటర్‌ను వినియోగించుకోవాలి
ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి ఏర్పా టు చేసిన కాల్‌సెంటర్‌ను జిల్లాలోని రైతులు సద్వి నియోగం చేసుకోవాలన కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో కోరారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, సేకరణ, రవాణా, మద్దతు ధర, సమాచారం, ఇతర ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 18004253424కు కాల్ చేయాలని ఆమె సూచించారు.


