
కేయూలో వర్క్‌షాప్ బ్రోచర్ ఆవిష్కరణ
కేయూ క్యాంపస్: కేయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో జూన్ 13 నుంచి 16 వరకు మాలిక్యూలర్ డాకింగ్ అంశంపై జాతీయస్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం క్యాంపస్‌లోని పరిపాలన భవనంలో వర్క్‌షాప్ బ్రోచర్‌ను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. ఈసందర్భంగా జువాలజీ విభాగం అధిపతి జి.షమిత మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో ఇన్‌సిలికో డ్రగ్ డిజైన్, మాలి క్యూల్ బిల్డింగ్, ప్రొటీన్ మాడలింగ్, డాకింగ్ సిమ్యులేషన్ అంశాలపై హ్యాండ్స్ ఇన్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే వారు ఈనెల 20లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తివివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, వివరాలకు ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి (9110741338)ని సంప్రదించాలని సూచించారు.