ఎంజీఎం: జిల్లాలో మాతృ మరణాలను నివారించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. 2024–2025లో సోమిడి, శాయంపేట మండలం గట్లకనపర్తిలో రెండు మాతృ మరణాలు జరిగాయి. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే గుర్తించిన లోపాలను ఎలా సరిదిద్దాలో వివరించారు. సమావేశంలో గైనకాలజిస్ట్‌లు జీఎంహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, సీకేఎం డాక్టర్ స్వప్న, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, ఫిజీషి యన్లు డాక్టర్ ఆశాలత, డాక్టర్ నిఖిల, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ అనిత, ఎస్‌ఓ ప్రసన్నకుమార్, డెమో అశోక్‌రెడ్డి, విజయలక్ష్మి, సురేఖ, సుప్రియ, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
కామర్స్ డీన్‌గా ప్రొఫెసర్ రాజేందర్
కేయూ క్యాంపస్: కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల డీన్‌గా పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం వీసీ ప్రతాప్‌రెడ్డి..రాజేందర్‌కు ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటివరకు డీన్‌గా ప్రొఫెసర్ అమరవేణి బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీకాలం ముగియడంతో రాజేందర్‌ను నియమించారు. కేయూలో 2005లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయన నియమితులయ్యారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, బీఓఎస్‌గా, ఖమ్మం పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈనెల 7న డీన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాజేందర్‌రెడ్డి.. రెండు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారు.
కే హబ్ డైరెక్టర్‌గా సవితాజ్యోత్స్న
కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్ డైరెక్టర్‌గా కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ టి.సవితాజ్యోత్స్నను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. రూసా నోడల్ ఆఫీసర్ సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఇన్నోవేషన్‌హబ్ ఇన్‌చార్జ్ కోఆర్డినేటర్‌గా సిద్ధార్థ
కే హబ్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంప్లాయ్‌బిలిటీ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇన్‌చార్జ్ కోఆర్డినేటర్‌గా కేయూ ఇంజనీరింగ్ కాలేజీ (కోఎడ్యుకేషన్) కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.సిద్ధార్థ నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులను సిద్ధార్థకు అందజేశారు.
హోదాకు తగని సీఎం వ్యాఖ్యలు : టీపీటీఎఫ్
విద్యారణ్యపురి: ఉద్యోగులనుద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తన హోదాకు తగవని అవగాహనా రాహిత్యంతో అర్థరహితంగా ఉన్నాయని టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరడం సహజమని, పరిష్కరించాలి లేదంటే సానుకూలంగా స్పందించి చర్చించాలి కానీ, అసహనంతో మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు.
మలిన జల శుద్ధి కేంద్రాలకు నిధులు
వరంగల్ అర్బన్: మలిన జల శుద్ధి కేంద్రాల అభివృద్ధికి ప్రోత్సాహక నిధులు అందజేయనున్నట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ థిల్లాన్ అన్నారు. అమృత్ 2.0లో ఎంపికైన నగరాల కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆమె ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా థిల్లాన్ మాట్లాడుతూ నగరాల స్థాయి, రేటింగ్ ఆధారంగా నిధులు ఇవ్వనున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీని వాస్, ఈఈలు రవి కుమార్, సంతోష్‌బాబు, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.