
భద్రకాళి అమ్మవారికి రథసేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులు మంగళవారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి హోమం, బలిఉత్సవం జరి పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి రథసేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హనుమకొండ నాయీబ్రాహ్మణ సంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, అతిథులుగా శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ బండారు జగదీశ్‌బాబు, గౌరవ సల హాదారులు తూముల సాంబయ్య, జీవనాఽథ్, కమిటీ సభ్యులు వాసు, రాముల రమేశ్, నరేందర్, జగన్, సురేశ్, శివ, సతీశ్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భద్రకాళి అమ్మవారికి రథసేవ