
వాహన తనిఖీల్లో ఏసీపీ నందిరామ్‌నాయక్
ఖిలా వరంగల్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరైనా.. రూ.50 వేలకుపైగా డబ్బులు తరలిస్తే తప్పనిసరిగా సంబంధిత రశీదులు, ఆధారాలతో డబ్బును తరలించాలని, లేకపోతే నగదును సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరామ్‌నాయక్ హెచ్చరించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం వరంగల్ ఫోర్ట్‌రోడ్డుపై అండర్ బ్రిడ్జి వద్ద ఏసీపీ నందిరామ్‌నాయక్ పర్యవేక్షణలో మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపీ, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.శివకుమార్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ పి.మల్లయ్య సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా నగదు తరలిస్తున్న శివనగర్‌కు చెందిన పత్తిపాక రమేశ్ వద్ద రూ.2,50,000లు, రైల్వేగేట్ పెరకవాడకు చెందిన పాశికంటి శంకర్ వద్ద రూ.1,77,200లు, ఖిలా వరంగల్‌కు చెందిన తోట జగన్ రూ.1,10,000లు పట్టుబడగా.. మొత్తం ముగ్గురి వద్ద రూ.5,37,200 నగదును స్వాధీనపర్చుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు గానీ, సరైన ఆధారాలు వారి వద్ద లేకపోవడంతో ఆడబ్బును స్వాఽధీనపర్చుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన నగదును ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్‌చార్జ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా ఆస్పత్రి లేదా వ్యాపారరీత్యా, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రూ.50 వేలకు పైగా.. డబ్బులు తరలిస్తే తప్పనిసరిగా గ్రామ అఽఽధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు, రశీదులు, ఆ ధారాలతో డబ్బును తరలించాలని ఏసీపీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు వెంకన్న, ము న్నీరుల్లా, మహిమూద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్
వాహన తనిఖీల్లో రూ.5,37,200 నగదు పట్టివేత