రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో వ్యవసాయం భారంగా మారుతోంది. పెట్టిన పెట్టుబడి చేతికందితే చాలు అనే పరిస్థితిలో పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి అనుకూలిస్తేనే పంట, పెట్టుబడి చేతికొచ్చే అవకాశం ఉంది. లేదంటే అప్పులే శరణ్యం.
– విష్ణువర్ధన్, రైతు, అమరచింత
ఆరుగాలం పొలాల్లో ఉంటూ పంట పండించే రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలి. పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలి. ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తే సాగు ఖర్చులతో పాటు రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది.
– నర్సింహులు, రైతు, అమరచింత
రైతులు రసాయన ఎరువులు వినియోగించడంతో భూమి సారం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెరుగుతున్నందున సేంద్రియ ఎరువులు వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా వరి పండించే రైతులు పచ్చిరొట్ట సాగుచేస్తే ఎరువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు.
– అరవింద్, ఏఓ, అమరచింత


