25 నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

25 నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రారంభం

Jun 18 2026 12:35 AM | Updated on Jun 18 2026 12:35 AM

సమావేశానికి హాజరైన బుద్ధారం గ్రామస్తులు

వనపర్తి: జిల్లాలోని ఓటర్లు 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమంలో పాల్గొని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు బూత్‌ లెవల్‌ అధికారులు ఇచ్చే ఫారం పూరించి ఇవ్వాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఒక ప్రకటనలో కోరారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1950లోని సెక్షన్‌ 17, 18, 31 అమలులో ఉన్నందున తప్పులు చేయకుండా జాగ్రత్తగా వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. తప్పుడు వివరాలు సమర్పిస్తే ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement