ఏటా పెరుగుతున్న పంట పెట్టుబడులు
●
అమరచింత: వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు ఏటా పెరుగుతున్న పెట్టుబడులు భారంగా మారుతున్నాయి. ట్రాక్టర్లు, యంత్రాలు, కూలీలు, ఎరువులు, విత్తనాలు ధరలు తడిసి మోపెడవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్నా.. అదనపు ఖర్చులకే సరిపోతోంది. ఎకరాకు సాగు ఖర్చు గతేడాది కంటే ఈసారి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోందని రైతన్నలు వెల్లడిస్తున్నారు. జిల్లాలో అత్యధిక రైతులు వర్షంపై ఆధారపడి పత్తి సాగు చేస్తున్నారు. అలాగే జూరాల ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు వివిధ ఎత్తిపోతల కింద సాగునీరు విడుదల చేస్తారనే ఆశతో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సుమారు 80 వేల ఎకరాల్లో మెట్ట పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ఎడమకాల్వ ఆయకట్టులోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో అత్యదికంగా వరి సాగు చేస్తుండగా.. మిగిలిన మండలాల్లో మెట్ట పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. వర్షాధారంగా పత్తి, వేరుశనగ, ఆముదం, కంది సాగుకు మక్కువ చూపుతున్నారు.
ఎరువుల ధరలు ఇలా (రూ.లలో..)
ట్రాక్టర్, నాగళ్ల అద్దె పెంపు
ఎరువులు, విత్తనాల ధరలది
అదే పరిస్థితి
అధికమవుతున్న వ్యవసాయ
కూలీల కూలి
సతమతమవుతున్న అన్నదాతలు


