● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల: రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని గోపల్‌దిన్నెలో 33/11 కేవీ సబ్‌స్టేషన్, మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఎక్స్‌రే ల్యాబ్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్న ఆర్టీసీ బస్సును ప్రారంభించడంతో పాటు కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపల్‌దిన్నెలోని సర్వేనంబర్ 357 ప్రభుత్వ భూమిలో నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు సన్నరకం వరికి బోనస్, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్భాటాలకు పోయి ప్రజలు అప్పులపాలు కావద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఖాజామైనుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్‌ఓ అరుణ, సర్పంచ్‌లు శివకుమార్, కవిత, మీసాల పార్వతమ్మ, సుదర్శన్‌రెడ్డి, రామన్‌గౌడ్, పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.


