లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి

Jun 16 2026 12:52 AM | Updated on Jun 16 2026 12:52 AM

గోపాల్‌పేట: విద్యార్థులు చిన్ననాటి నుంచే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. సోమవారం ఉమ్మడి గోపాల్‌పేట మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులకు ఆయన పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తగిన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement