అమరచింత: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ తెలిపారు. శనివారం పట్టణంలోని జీఎస్ భవన్‌లో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. 20న జరిగే బహిరంగసభకు ముఖ్యఅతిథిగా త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి బి.వెంకట్, దాసన్, ఎంపీలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. మొదటిరోజు భారీ ప్రదర్శన, జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగసభ జరుగుతుందన్నారు. 21, 22 తేదీల్లో జరిగే మహాసభలకు 33 జిల్లాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మహాసభలకు వ్యవసాయ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శంకర్, ఆర్‌ఎన్ నాగరాజు, ఆంజనేయులు, బెక్కెం కురుమన్న తదితరులు పాల్గొన్నారు.


