కాంగ్రెస్‌తోనే పేదల అభ్యున్నతి
గెలుపు, ఓటమి
సమానంగా చూడాలి..
వనపర్తిటౌన్: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన కాంగ్రెస్‌పార్టీ దేశ ప్రజల మన్ననలు చిరకాలం పొందుతూనే ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో 140 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకై క పార్టీ కాంగ్రెస్ అని.. స్వాతంత్య్ర తొలినాళ్లలో తినడానికి సరైన తిండి లేని పరిస్థితుల నుంచి దేశ గౌరవాన్ని కాపాడుతూ అభివృద్ధి చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. టీపీ సీసీ కార్యదర్శి నందిమళ్ల యాదయ్య, పీసీసీ కమిటీ సభ్యుడు డెలిగేట్ శంకర్‌ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, టీఎస్ మీడియా కన్వీనర్ నందిమళ్ల చంద్రమౌళి, జిల్లా నాయకులు కదిరె రాములు, కోళ్ల వెంకటేష్, మధుగౌడ్, ఎండీబాబా, గణేష్‌గౌడ్, నాగరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపు, ఓటమిని సమానంగా చూడటమే క్రీడాతత్వమని.. గెలిచినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, ఓడినప్పుడు నిరుత్సాహపడొద్దని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు.. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ప్రీమియం లీగ్ సీజన్–6 క్రికెట్ పోటీల చివరి మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బ్యాటింగ్ చేసి పోటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది ఉండదని.. క్రీడాకారులు తమ నైపుణ్యాలతో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం, లీగ్ నిర్వాహకులు మధు, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.


