రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
మదనపురం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సరళాసాగర్ ఆయకట్టుకు యాసంగి సాగు నిమిత్తం శనివారం సాయంత్రం జలాశయం ఎడమ కాల్వ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రైతులకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో లిఫ్ట్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసాచారి, డైరెక్టర్ పావని, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, జగదీశ్, అక్కల మహదేవన్‌గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, సాయిబాబా, శ్రీధర్‌రెడ్డి, డీలర్ లక్ష్మయ్య, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


