ఆయకట్టు కుదింపు
యాసంగిలో చంద్రగఢ్ ఎత్తిపోతల ఆయకట్టుకు సాగునీరు అందించాలని మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవిస్తాం. 15 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతుకు గురికావడంతో వానాకాలంలో కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించా రు. ప్రస్తుతం యాసంగికి సైతం అందించాలి.
– సర్వారెడ్డి, అధ్యక్షుడు, చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం, మిట్టనందిమళ్ల
మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగిలో కేవలం రామన్‌పాడు వరకే సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించడం శోచనీయం. గతంలో సైతం యాసంగి సాగునీటిని కుదించిన ఆయకట్టుకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆరుతడి పంటల సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పడం దారుణం. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించాలి. – ఎండీ నడిపి ఖాజా,
మామిడి రైతు, గోవర్ధనగిరి, వీపనగండ్ల
అమరచింత: జూరాల ఆయకట్టులో యాసంగి సాగుకు వారబందీ విధానంలో నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టు సమీపంలోని రామన్‌పాడు రిజర్వాయర్ వరకు అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 10 వేల నుంచి 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించడం, గురువారం జరిగిన ఐఏబీ సమావేశంలో వారబందీని అమలు చేస్తూ తక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రెండేళ్ల కిందట ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో నాటి యాసంగి సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించిన అధికారులు.. ప్రస్తుతం జలాశయంలో సమృద్ధిగా నీరున్నా ఎందుకు నీటిని వదలడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎడమ కాల్వ కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుతం కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించడం ఏమిటని అంటున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో విస్తరించి ఉండగా కేవలం అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల రైతులకే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రకటించడం సరికాదని అంటున్నారు.
యాసంగి విస్తీర్ణం ఖరారు..
ప్రస్తుతం జలాశయం నుంచి 4.690 టీఎంసీల నీటిని వినియోగించేందుకు అవకాశం ఉంది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద రామన్‌పాడ్ జలాశయం వరకు మాత్రమే సాగునీటి సరఫరాకు ప్రణాళిక ఖరారు చేశారు. సాగు, తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న క్రమంలో ముందస్తుగా వారబందీ విధానం అమలు చేస్తున్నారు. గత గురువారం నుంచే వారబందీ అమలు చేస్తూ కాల్వలకు నీటి సరఫరా చేస్తున్నారు.
గ్రామాల్లో టాంటాం..
ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని పెబ్బేరు, వీపనగండ్ల, కొత్తకోట, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల ఆయకట్టు గ్రామాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు యాసంగిలో సాగునీరు అందదని, దీనిని దృష్టిలో ఉంచుకొని నారుమడులు వేసుకోవాలని దండోరా వేయిస్తున్నారు.
జూరాల ఎడమ కాల్వ పరిధిలో
15 వేల ఎకరాలకే సాగునీరు
యాసంగిలో వారబందీ విధానం అమలు
చివరి ఆయకట్టు గ్రామాల్లో చాటింపు
ఆందోళనలో అన్నదాతలు
ఆయకట్టు కుదింపు
ఆయకట్టు కుదింపు
ఆయకట్టు కుదింపు


