ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం యాసంగి సాగుకు ఆయకట్టును కుదించింది. ఎడమకాల్వ పరిధిలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు మాత్రమే 15 వేల ఎకరాలకు వారబందీ విధానంలో సాగునీరు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో యాసంగి సాగుకు నీరు ఇవ్వమంటూ ముందస్తుగా టాంటాం వేయించాం. పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే వదులుతాం.
– జగన్మోహన్,
ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం
●


