అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్‌రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్‌రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి.
– అడ్డాకుల


