కాజ్‌వే.. కానరాదే?
మదనాపురం మండలం దంతనూరు–శంకరమ్మపేట మధ్య రాకపోకలకుగాను
శంకరమ్మపేట జలాశయానికి అనుసంధానంగా వాగుపై కాజ్‌వే నిర్మించారు. గత
వర్షాకాలంలో శంకరసముద్రం నుంచి వరద ఉధృతంగా పారడంతో కాజ్‌వే కోతకు గురై
రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు తాత్కాలిక రహదారి వేసి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా సురక్షితంగా లేదు. రాత్రివేళలో వాహనదారులు
ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని.. తక్షణమే స్పందించి శాశ్వత ప్రాతిపదికన
కాజ్‌వే పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – మదనాపురం


