సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
కొత్తకోట రూరల్/ఖిల్లాఘనపురం: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం మొదటి విడత పోలింగ్ జరిగే పెద్దమందడి, ఖిల్లాఘనపురం ఎంపీడీఓ కార్యాలయాల్లోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్ని ఆయన సందర్శించి సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని తెలిపారు. ఫారం 14 దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. ఎన్నికల విధుల ఆర్డర్ కాపీ, ఓటర్ ఐడీ లేదా మరో గుర్తింపు కార్డు జిరాక్స్ తనిఖీ చేయాలన్నారు. ఓటు వేసిన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. అంతేగాక పోలింగ్ సమయంలో ఎలాంటి లోపాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉద్యోగుల ను ఆదేశించారు. కలెక్టర్ వెంట పెద్దమందడి తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ పరిణత, ఖిల్లాఘనపురం తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.


