పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి
వనపర్తి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎన్నికల అఽధికారి యాదయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత ఎన్నికల విధులు నిర్వర్తించే వారు ఈ నెల 8న, రెండోవిడత ఎన్నికలు జరిగే ప్రాంతాల వారికి ఈ నెల 12న, మూడో విడత వారికి ఈ నెల15న ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లుఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫారం–14తో పాటు ఫారం–17పై సంతకం చేసి నిర్దేశిత సమయంలోగా సమర్పించాలని సూచించారు.
జీపీఓఏ జిల్లా
కార్యవర్గం ఎన్నిక
వనపర్తి రూరల్: జీపీఓఏ (గ్రామపంచాయతీ అధికారుల సంఘం) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గోపాల్‌రావు, జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా సురేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా శివారెడ్డి, వెంకటన్న, కోశాధికారిగా మల్లేష్, మహిళా అధ్యక్షురాలిగా అంజమ్మతో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీజీటీఏ జిల్లా అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, టీజీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీకాంత్, టీఎన్జీఓ ఉపాధ్యక్షుడు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రభావిత ఉద్యమశక్తి జయరాజ్’
వనపర్తిటౌన్: సమాజాన్ని ప్రభావితం చేసిన శక్తి ప్రముఖ కవి, ఉద్యమ గాయకుడు జయరాజ్‌దేనని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, రాష్ట్ర కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత జయరాజ్‌ను సాహితి కళావేదిక ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కవిగా, గాయకుడిగా తన పంతా మార్చుకోకుండా ముందుకు సాగి తెలంగాణలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో పాటలు రచించి ఉద్యమ నిర్మాణంలో తన భక్తిని చాటారని కొనియాడారు. నిరంతరం పేద, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. జయరాజ్ సాహిత్యం ఎంతోమంది వర్ధమాన కవులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జయరాజ్ తను రచించిన పలు పుస్తకాలను పలువురు సాహితీవేత్తలకు అందజేశారు. కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, నరేష్‌కుమార్, శ్యాంసుందర్, ఉప్పరి తిరుమల్లేశ్, రచయితలు డా. వీరయ్య, పపద్మావతి, డా. కంటే నిరంజనయ్య, మధుకర్, కిరణ్‌కుమార్, దర్శన్‌కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సైక్లింగ్‌లో సత్తా చాటాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్ బి.గోపాలం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం నుంచి వెంకటాంపల్లి వరకు బాలికలకు 5 కిలోమీటర్లు, బాలురకు 8 కిలోమీటర్ల జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో బాలికల విభాగంలో శశి, ప్రియ, మీనాక్షి, ఇందు, చందన, ప్రవస్తి, జ్యోతి, సంజన, పూజ, సంగీత, బాలుర విభాగంలో రాము, ఉదయ్, రక్షిత, యశ్వంత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజేతలకు గోపాలం పతకాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీలు దేవేందర్, చిట్టి, పాఠశాల ఏఎన్‌ఎం వెంకటమ్మ, సహాయకులు రజిత, నవీన్ పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి


