రెండోవిడత.. తేలిన లెక్క
ఐదు సర్పంచ్, 148 వార్డుస్థానాలు ఏకగ్రీవం
వనపర్తి: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్న విషయం విధితమే. తొలి విడత 87 సర్పంచ్, 780 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఐదు సర్పంచ్, 104 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. రెండోవిడత నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు ప్రక్రియ శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ విడతలో ఐదు గ్రామాల్లోని సర్పంచ్ స్థానాలు, 148 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 89 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఈ నెల 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. సర్పంచ్‌ల బరిలో 294 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 1,768 మంది అభ్యర్థులు ఉన్నట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి యాదయ్య వెల్లడించారు.
మూడోవిడతలో..
మూడోవిడతలో 87 సర్పంచ్ స్థానాలకు 459 మంది అభ్యర్థులు, 806 వార్డులకు 1,914 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపసంహరణ, ఏకగ్రీవాల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుదిజాబితా వెలవడనుంది.
మిగిలిన స్థానాల్లో బరిలో నిలిచిన
అభ్యర్థులు
గుర్తుల కేటాయింపు పూర్తి..
14వ తేదీన పోలింగ్


